చిన్న కథల పోటీ

విడుదలైన ఆరువారాల్లోనే అక్షరాలా అరలక్ష మంది వీక్షకుల సంఖ్యను దాటేసి లక్ష వైపుగా దూసుకుపోతున్నది సినీవాలి సాహిత్య వార పత్రిక.
ఈ శుభ సందర్భంలో సెప్టెంబర్ 1న నా జన్మదినాన్ని పురస్కరించుకొని రచయితలు ఆసక్తిగా పాల్గొనే విభిన్నమైన

చిన్న కథల పోటీని ప్రకటిస్తున్నాము.

ఆసక్తికరమైన అంశంతోబాటు చదివించే చక్కని శైలి పాఠకులను అలరించాలనే సంగతి మరవొద్దు.
అన్నిటి కంటే ముఖ్యంగా ఈ పోటీ ముఖ్య ఉద్దేశం-క్లుప్తత.
మీరెంత చిన్న కథ రాయగలరు? నాలుగు పేజీలు? మూడు? రెండు??
ఛాయిస్ మీదే! ఎంత చిన్న కథ అయితే పరిశీలనకు స్వీకరించే అవకాశాలు అంత ఎక్కువ ఉంటాయి.

25 కథలకు 500/- ల చొప్పున బహుమతులు అందిస్తాం.

అక్షర దోషాలు, కామాలు-ఫుల్ స్టాప్ లు, పేరాగ్రాఫ్ లు ఇన్వర్టడ్ కామాలను తేలికగా తీసుకోకండి. ఈ విషయంలో సినీవాలి చాలా నిక్కచ్చి. పాఠకుడికి పంటి కింది రాయిలా రావడం సంగతి తర్వాత, ముందు న్యాయ నిర్ణేతలే నిర్మొహమాటంగా పక్కన పెట్టేస్తారు. మీరెంత మంచి అంశం రాసినా, మీ శైలి ఎంత బాగున్నా మీ కథ బుట్టదాఖలా అయ్యే ప్రమాదముంది.

పీడీ ఎఫ్ లూ, చేత్తో రాసి తీసిన ఫోటో కాపీలూ, స్కాన్ కాపీలూ పరిశీలనకు స్వీకరించలేము.
కేవలం యూనికోడ్ మాత్రమే అంగీకారయోగ్యం. కథలు సినీవాలి కోసం ప్రత్యేకంగా రాసినవై ఉండాలి.
ఆ విషయం హామీ పత్రంలో కంపల్సరీగా రాయాలి!
ఇంతకు ముందు సినీవాలి చేత రిజెక్ట్ చేయబడినవి పంపకూడదు.
మేము ఫలితాలు ప్రకటించేంత వరకు ఆగే ఓపిక లేని వాళ్ళు కథలు పంపకూడదు.
ఎన్ని కథలు పంపడం ముఖ్యం కాదు. గడువు తక్కువే ఉంది కాబట్టి ఒకే కథను-పోటీలో నిలిచేలా సూచించిన ప్రామాణికాలను పాటిస్తూ, పంపితే తప్పక విజేతలు మీరే.
ఆలస్యమెందుకు మరి? ఆఖరు తేదీ ఎంతో దూరంలో లేదు. ఆగస్టు 15 లోపు గానీ ఆరోజు అర్ధరాత్రికి గానీ మాకు అందాలి.
చిన్న కథలపోటీకి అని మెయిల్ లో స్పష్టంగా పేర్కొనాలి
మెయిల్ ఐడీ తెలుసుగా,

cineevaaliweekly@gmail.com

ఫలితాలు సరిగ్గా నా జన్మదినం అంటే సెప్టెంబర్ 1న ప్రకటిస్తాము.

అట్లాగే, పోటీ ఫలితాల డేటు విషయం గురించి గానీ దయచేసి ఎటువంటి ఫోన్ కాల్స్, వాట్సప్, మెసెంజర్ల ద్వారా సంప్రదించకూడదని మనవి.

డా.ప్రభాకర్ జైనీ

ప్రధాన సంపాదకుడు,
సినీవాలి
ఉచిత ఆన్ లైన్ సాహిత్య వార పత్రిక

18 thoughts on “చిన్న కథల పోటీ”

  1. Lalitha varma

    పత్రిక చాలా ఆకర్షణీయంగా ఉంది. అభినందనలు మీకు.

  2. మద్దాళి నిర్మల

    రచయితలను బాగా ప్రోత్సహిస్తున్నందుకు ధన్యవాదాలు.

  3. Gadiraju rangaraju

    కార్టూన్లు సంఖ్య పెంచితే బాగుంటుంది సార్

  4. పి.వి.ఆర్.శివకుమార్

    నాలుగు/మూడు/రెండు….పేజీల సంఖ్య కూడా నిబంధనలలోనే నిర్దేశిస్తే ఇంకా బాగుండేది.
    శుభాభినందనలు.

    1. డాక్టర్ ప్రభాకర్ జైనీ

      ఎంత చిన్నదైతే అంత మంచిదని చెప్పినట్టు గుర్తు.

  5. Subhadra Devi

    Congratulations!!
    Dr.Prabhakar Jaini garu on magazine crossing fifty thousand readers.
    Your efforts are really hard and praise worthy.

  6. Lalitha varma

    అంతా బాగుంది కానీ పత్రికకు పేరు తెలుగులో పెడితే బాగుండేదేమో!

    1. Peddinti Ashok Kumar

      నేను సినీవాలి పాఠకుడిని. పత్రిక చాలా బాగుంది. కొత్త రచయితలను ప్రోత్సహిస్తున్నందుకు, ఈ కాలానికి తగినట్టుగా అరచేతిలో అద్బుతమైన పత్రిక అందిస్తున్నందుకు జైనీ గారికి అభినందనలు.

    2. డాక్టర్ ప్రభాకర్ జైనీ

      తెలుగు పేరే అండీ. సినీవాలి అంటే పార్వతీ దేవికి మరోపేరు. అమావాస్య నాడు కనిపించే చిరుకాంతి రేఖను కూడా సినీవాలి అంటారు. మీరు తెలుసుకుంటే బాగుండేది.

      1. మన్నించండి నేను సినీ అనగానే పరభాషా పదమే అనుకున్నాను ఆలోచించలేదు. నిజమే

  7. padmavathi thalloju

    సర్ నమస్తే,
    ఈ వారం చక్కిలిగింతల చక్కని కార్టూన్ గా బహుమతి పొందిన రామ్ ప్రసాద్ గారి కార్టూన్ సందేశాత్మకంగా ఉంది.నాకో డౌట్ సార్! చక్కిలిగింత ల కార్టూన్ అంటే మనల్ని నవ్వించాల్సిన అవసరం లేదా?

  8. Tumbali Sivaji

    పత్రిక బాగుంది. ఇంకా మంచి మంచి శీర్షికలతో అలరించండి.

  9. డాక్టర్ ప్రభాకర్ జైనీ

    లేదు. మనసును చక్కిలిగింతలు పెట్టిస్తే చాలు. ఒక బాలుడి హృదయాన్ని ఆవిష్కరించిన కార్టూనిస్టును అభినందించండి.

  10. బొందల నాగేశ్వరరావు

    పత్రిక బాగుంది. శుర్షికలూ బాగున్నాయి.. కథలను పెంచగలిగితే ఇంకా బాగుంటుందన్నది నా అభిప్రాయం

  11. P. UMA MAHESWARA RAO

    సినీవాలి పత్రికను ఈ రోజే చూడడం జరిగింది. పత్రిక సర్వాంగ సుందరంగా బాగుంది. అభినందనలు.

    చిన్న సూచన. పత్రికను ఇప్పుడున్న స్క్రోల్ పద్ధతిలో కాకుండా, పేజీలు తిప్పుకునే విధంగా(flip mode) తెస్తే బాగుంటుంది.

    మహేశ్వర రావు

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top