రాబోయే కథల పోటీ

మాండలిక/#యాసకథలపోటీ

30 బహుమతులు

దసరా పండగ సందర్భంగా, ‘సినీవాలి’ మాండలిక కథలపోటీ నిర్వహిస్తుంది. #కేవలం_యాస/#మాండలికంలో “సినీవాలి” కోసం ప్రత్యేకంగా రాసిన కథలనే సెప్టెంబర్ 15 లోగా పంపాలి. యూనీకోడ్ లో మాత్రమే పంపాలి. హామీపత్రం తప్పక జతపరచాలి. ఎన్ని కథలైనా cineevaaliweekly@gmail.com కు పంపవచ్చు.

నో వర్డ్స్ లిమిట్

కానీ, ఇక్కడ పరిశీలనలో ఉండగా మరొక పత్రికకు పంపకూడదు. దీనికి ఎవ్వరూ మినహాయింపు కాదు. ఏ ప్రాంతం వారైనా పాల్గొనవచ్చు. మాకు, ఇతర పత్రికలలాగా ప్రాంతీయ భేదాలు లేవని మీరు ఇప్పటికే గమనించి ఉంటారు. తెలుగు ప్రజల కోసం, తెలుగు భాషాభివృద్ధి కోసం అహర్నిశలు కష్టాలు మేము పడుతూ, మీకు ఉచితంగా పత్రికను అందిస్తున్నాము. మాకు స్వార్థం కూడా లేదు. అన్ని పత్రికలు బాగా నడవాలి. అందులో మా ‘సినీవాలి’ ఉండాలి. మరిన్ని కొత్త పత్రికలు రావాలి. తెలుగు పత్రికలన్నీ కళకళలాడాలి. కానీ, ఒకరి మీద మరొకరు అసూయాద్వేషాలు పెంచుకోకుండా, సర్క్యులేషన్ మాత్రమే పెంచుకోవాలి.

అసలు ఒక ప్రాంతపు యాస మరొక ప్రాంతం వారికి కష్టమే అయినా, తప్పక నేర్చుకోవాల్సినవి. ఇది మన జాతి సంపద. పెద్దలు చెప్పినట్లు వీటిని కాపాడుకోకుంటే, # కొన్నితరాల తర్వాత మన భాష తల్లి వేరు లేని వట్టి కాండంలా మిగిలిపోతుంది.

మాండలికంలో, ఒక మాధుర్యం ఉంటుంది. మనను వదిలి వెళ్ళిన ఆత్మీయుల ఆత్మల భాష అది.

ఇప్పటి వరకు కొంత మంది మాట్లాడిన భాషే సాహిత్యాన్ని డామినేట్ చేసింది. ఆ దాస్య భావాల నుండి ఇప్పటికైనా విముక్తి పొందాలి. అందుకని మాండలికంలో రాస్తూనే ఉండాలి.

మేము అందుకే ‘సినీవాలి’ లో యాసకు ప్రాధాన్యం ఇస్తున్నాము. తెలంగాణా యాసలోని మాధుర్యాన్ని అలాగే కళింగాంధ్ర, రాయలసీమ మాండలికాల్లోని మాధుర్యాన్ని అందరూ ఆస్వాదించాలి. జిల్లాజిల్లాకు యాస, భాషా పదాలు మారుతుంటాయి. అవన్నీ గ్రంథస్తం కావాలి.

”నాకు రాదు! నేనెంత?” వంటి నీరస భావనల నుండి బయటపడండి. ఇక్కడ, ఎవ్వడూ, “ఎవ్వడూ” తోపు కాదు.

గొప్ప గొప్ప రచయితలు ఇప్పుడు రాయలేరు. వారికి ఓపిక, సాంకేతిక పరిఙ్ఞానం, రాయాలన్న ఆసక్తి లేదు. తాము సాధించిన విజయాలతో, సంపాదించిన డబ్బుతో తృప్తిపడి జీవిస్తున్నారు. కాబట్టి, నవతరం నాయికా నాయకులైన యువతీ యువకులే బాగా రాయాలి.

మంచి కథ రాస్తే మీరే తోపు.

ఎందుకంటే నా మితృల మీద నాకు అపార నమ్మకం కాబట్టి!

3 thoughts on “రాబోయే కథల పోటీ”

  1. Gunna Krishna Murty

    మీ(మ‌న‌) ప‌త్రిక బాగుంది. ఇదే మొద‌టిసారి చూడ‌డం. ఇంకా పూర్తిగా చ‌ద‌వాల్సి ఉన్న‌ది.

    తాజా క‌థ‌ల పోటీల్లోని మీ గొప్ప ఉద్దేశానికి ధ‌న్య‌వాదములు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top