ఆకాశమే నీ హద్దు రా! ………..శీర్షిక

మిట్టమధ్యాహ్నం.

భోజనాలయ్యాక, కాసేపు కునుకు తీద్దామనుకుంటే తల్లికి నిద్ర పట్టడంలేదు.

ఇంతలో వాట్సప్ లో మెసేజ్ వచ్చినట్టుగా రింగ్ టోన్ వినిపించింది.

తల్లి ముఖం సంతోషంతో వెలిగిపోయింది.
(#ప్రభు)
కానీ, ఇంగ్లీషులోని ఆ మెసేజ్ చదవగానే, తల్లి ముఖం చిన్నబోయింది.

ఆ మెసేజ్:

“అమ్మా! నేను మోసపోయానమ్మా!” అంటూ దాని పక్కనే ఏడుస్తున్నట్టుగా ఉన్న రెండు ఈమోజీలను చూసి తల్లి గుండె చెరువయింది. చేతులు వణుకుతుండగా,

“ఏమైంది?” అని తెలుగులో టైప్ చేసి ప్రశ్నించి, భర్తకు నిద్రాభంగం కలగకూడదని మెల్లగా అడుగులు వేసుకుంటూ బెడ్ రూము బయటకొచ్చింది.

“నేను నా నోటితో చెప్పలేనమ్మా!” అనేసరికి నిజంగానే భయపడిపోయింది. (ప్రభు)

ఎక్కడో దూరంగా అమెరికాలో ఉద్యోగం చేస్తున్న ఏకైక సంతానం అలా అనేసరికి, గుండెలు వణుకుతుండగా,

“చెప్పకపోతే ఎలా? ఏం జరిగినా ధైర్యంగా ఉండు! ఎటువంటి సమస్యనైనా నిబ్బరంగా ఎదుర్కుందాం. నీకు నేనూ, మీ నాన్నా ఎప్పుడూ తోడుగా నిలబడతాం! మన వంశం పేరుప్రఖ్యాతులు తెలుసు కదా? అసలింతకీ ఏం జరిగింది?”ఛాటింగులోనే, తన గుండెలు పీచుపీచుమంటున్నా, ధైర్యం నూరిపోసింది.

“అమ్మా! అమ్మా! నాన్నగారికి చెప్పకమ్మా! మన వంశానికి కళంకం తెచ్చే పని చేసాను!”

తల్లికి చిర్రెత్తి,

“యెహె! ఏమైందో చెప్పి చావు ముందు. నువ్వూ నీ సెంటిమెంటల్ డైలాగులూనూ…!” అని కసురుకునే సరికి,

“అమ్మా! #నేను_ప్రెగ్నెంట్ అని అనుమానంగా ఉందే?” అని చటుక్కున వచ్చిన మెసేజ్ చూసేసరికి తల్లి విభ్రాంతికి గురయింది. తల్లికి బుర్ర తిరిగి, (ప్రభు)

“దొంగ వెధవా! సచ్చినోడా! తాగుబోతు వెధవా! అర్థరాత్రి వరకూ తాగుతూనే ఉన్నావా? నీ దగ్గర నుంచి ఫోనో, మెసేజో రాలేదని నేను కంగారుపడుతుంటే,, ‘ప్రెగ్నెంట్’ అని మెసేజ్ పెడతావా? మగవెధవ్వి నువ్వు ప్రెగ్నేంటిరా?” అని ఫోనులోనే తలంటేసరికి, కొడుక్కి వీకెండులో ఎక్కిందంతా దిగి,

అమ్మ కాళ్ళు పట్టుకుంటున్నట్టున్న ఈమోజీ పంపి, “సారీ! అమ్మా!” అని మెసేజ్ పెట్టి,

‘ఛీ! తాగి, అమ్మతో ఛాటింగ్ చేయకూడదు. అయినా ఇందాక ఎవరో అమ్మాయి వాళ్ళమ్మతో చెప్పిన మాటలను నేను మా అమ్మకు చెప్పడమేమిటి? ఛఛ! మందుతో బుర్ర పనిచేయడం లేదు. ఇంకా నయం నాన్నతో ఛాటింగ్ చేయలేదు’ అనుకుంటూ నిద్రపోయే పనిలో పడ్డాడు పుత్రరత్నం.

+++

డాక్టర్ ప్రభాకర్ జైని

………………………………………………………………………

ఉత్తర ఈశాన్య రాష్ట్రం అయిన మణిపూర్ మండుతున్నది !
ఏదో మాట వరసకి మండుతున్నది అనే పదం వాడడం లేదు ! నిజంగానె మండుతున్నది !
May 3 న మొదలయిన ఘర్షణలు ఈ రోజుకి తీవ్ర రూపం దాల్చి చివరకి కనిపిస్తే కాల్చివేత ఉత్తర్వులు ఇవ్వాల్సిన స్థితిలోకి వెళ్ళిపోయింది మణిపూర్ రాష్ట్రం. PSP
మణిపూర్ లో ఉంటున్న కుకీ,నాగా, మెతీ తెగల ప్రజల మధ్య తీవ్ర ఘర్షణలు జరగడం వల్ల చివరికి కర్ఫ్యూ విధించాల్సిన పరిస్థితి ఏర్పడింది అక్కడ.
గత నాలుగు రోజుల నుండి ఇంటర్నెట్, మొబైల్ సేవలని నిలిపివేశారు అధికారులు. కానీ ఘర్షణలు ఆగలేదు సరికదా ఇంకా పెరిగిపోయాయి.PSP


మణిపూర్ లో జాతుల మధ్య వైరం ఎందుకు వచ్చింది ?

  1. మణిపూర్ లో ముఖ్యంగా మూడు తెగల ప్రజలు ఉన్నారు. కుకీ తెగ, నాగా తెగ, మెతీ[Meitie ] తెగ ప్రజలు ఉంటున్నారు. అఫ్కోర్స్ 4వ తెగ అయిన కుకీ ఫంగల్ కూడా అక్కడ ఉంది.
  2. కుకీ,నాగా తెగల ప్రజలు షెడ్యూల్ ట్రైబ్ [ST] కింద రక్షణ పొందుతున్నారు. వీళ్ళు అందరూ క్రైస్తవులు.
  3. మెజారిటీ తెగ ప్రజలు అయిన మెతీ ప్రజలు హిందువులు. వీళ్ళు మణిపూర్ లో గత 2 వేల సంవత్సరాలకి పై బడి ఉంటున్నారు.PSP
  4. ఇక మెతీ తెగ ప్రజలలో మతం మార్చబడ్డ ప్రజలని మెతీ పంగల్ లు అంటారు వీళ్ళు ముస్లిమ్స్. PSP
  5. మణిపూర్ రాష్ట్ర భౌగోళిక స్వరూపం ఎలా ఉంటుంది అంటే 22,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం గా ఉంది. ఇందులో 10% లోయ ప్రాంతం [Valley] గా ఉండి ఒక మైదానంలాగా చదునుగా ఉంటుంది. మిగతా 90% ప్రాంతం మొత్తం ఎత్తైన పర్వతాలు,కొండలు లోయకి అన్ని దిశలలో వ్యాపించి ఉన్నాయి.
  6. ఎత్తైన కొండ ప్రాంతాలలో కుకీ మరియు నాగా జాతి ప్రజలు ఉంటున్నారు. లోయలో ఉండే మైదాన ప్రాంతంలో మెతీ తెగ ప్రజలు ఉంటున్నారు.
  7. మనకి స్వాతంత్ర్యం వచ్చాక కుకీ,నాగా ప్రజలని షెడ్యూల్ ట్రైబ్స్ జాబితాలో చేర్చారు. ఈ కుకీ,నాగా ప్రజలు మొత్తం కొండల మీద ఉంటారు. PSP
  8. ఈ కొండ ప్రాంతానికి రక్షణ గా ఆర్టికల్ 371c రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. ఆర్టికల్ 371c అనేది దాదాపుగా కాశ్మీర్ కి సంబంధించిన ఆర్టికల్ 370 లోని నిబంధనలకి దగ్గరగా ఉంటాయి! అంటే ఈ కొండ ప్రాంతాలలో బయటి వాళ్ళు ఎవరూ స్థలాలు కొనడానికి వీలు లేదు.PSP
  9. ఈ కొండ ప్రాంతంలో ఉండే అడవుల లో కుకీలు,నాగాలు ఉండవచ్చు కానీ ఆ స్థలాలని అమ్మడానికి లేదు బయటి వాళ్ళు కొనడానికి లేదు.PSP
  10. కానీ అదే లోయలో ఉండే మైదాన ప్రాంతంలో ఎవరయినా స్వేచ్ఛగా స్థలాలు కొనవచ్చు, అక్కడ ఎవరయినా నివాసాలు ఏర్పరుచుకోవచ్చు. వ్యాపారాలు చేసుకోవచ్చు.
    (**
    సమస్య ఎక్కడ వచ్చింది అంటే ఒకే రాష్ట్రంలో ఉన్న ప్రాంతాలకి వేర్వేరు చట్టాలు, అధికారాలని అమలు చేయడమే !
    మణిపూర్ రాష్ట్రంలో కొండ ప్రాంతాల కోసం అంటూ ప్రత్యేకంగా ఒక హిల్ ఏరియా కమిటీ [Hill Area Committee-HAC ] ఏర్పాటు చేశారు. ఈ హిల్ ఏరియా కమిటీ అనేది ఏదో ఆషా మాషీ కమిటీ అనుకుంటే పొరపాటే !
    HAC లేదా హిల్ ఏరియా కమిటీ కి ఉన్న అధికారాలు ఏమిటే తెలిస్తే ఆశ్చర్యం వేయక మానదు.PSP

మణిపూర్ రాష్ట్ర బడ్జెట్ శాసన సభ్యుల ఆమోదం పొందితే సరిపోదు ! HAC కి బడ్జెట్ లో పొందుపరిచిన అంశాలు ఏమిటో తెలియచేయాలి. HAC సభ్యులు ఆ బడ్జెట్ లో కొండ ప్రాంతంలో ఉంటున్న కుకీ,నాగా ప్రజలకి వ్యతిరేకంగా ఏమీ లేవనీ.. వాళ్ళ అభివృద్ధికి నిధుల కేటాయింపులో ఎలాంటి వివక్ష లేదని నిర్ధారించుకున్న తరువాత ఆమోదం తెలిపితే అప్పుడు మణిపూర్ రాష్ట్ర బడ్జెట్ కి సంపూర్ణ ఆమోదం లభిస్తుంది. HAC ఆమోదం లేకపోతే ఆ బడ్జెట్ కి విలువ ఉండదు!PSP
అలాగే మణిపూర్ లాండ్ రెవిన్యూ మరియు లాండ్ రిఫార్మ్ [MLR & LR] ల మీద HAC కి అధికారం ఉంది.


ఇప్పుడు అసలు సమస్యకి కారణం ఏమిటో చెప్తాను!PSP
షెడ్యూలు కులాలు మరియు షెడ్యూల్ జాతులు కొరకు ఏర్పాటు చేసిన చట్టాలు ఎప్పుడయితే మొదలయ్యాయో అప్పటి నుండి మణిపూర్ లో ఉన్న కుకీ,నాగా ప్రజలకి ST హోదా కల్పించారు. అలాగే కొండ ప్రాంతాలలో ఉండే అడవులలో స్వేచ్చగా తమకి ఇష్టం వచ్చినట్లు బ్రతికే హక్కునీ కల్పించారు. ఇంతవరకు బాగానే ఉన్నా కుకీలు,నాగా లు మతం మారి క్రైస్తవం స్వీకరించాక వీళ్ళకి ST హోదాని ఎందుకు రద్దు చేయలేదు ?PSP


అదే కొండ దిగువ ప్రాంతంలో ఉండే మీతీ ప్రజలని జెనెరల్ కాటగిరీ లో ఉంచేశారు ఎందుకు? వాళ్ళు సనాతన ధర్మాన్ని ఆచరిస్తున్నందుకా? అసలు మణిపూర్ లో మూల వాసులుగా చెప్పబడే మీతీ ప్రజలకి ఎలాంటి ప్రత్యేక హక్కులు ఎందుకు లేకుండా చేశారు ?PSP

  1. లోయ లోని మైదాన ప్రాంతంలో ఉంటున్న మితీ ప్రజల స్థలాలని ఎవరయినా కొనవచ్చు. బయటి వాళ్ళు అక్కడ ఉద్యోగ,వ్యాపారాలు చేయవచ్చు మరియు శాశ్వత నివాసాలు ఏర్పాటు చేసుకోవచ్చు.
  2. ప్రస్తుత సమస్యకి కారణం ఏమిటంటే వేల ఏళ్ల నుండి ఉంటున్న మితీ ప్రజలు మొదట్లో మెజారిటీగా ఉంటూ వచ్చినా కాల క్రమేణా మైనారిటీ ల కిందకి వచ్చేస్తున్నారు రాను రాను.PSP
  3. బంగ్లాదేశ్,మియాన్మార్ నుండి అక్రమంగా మణిపూర్ లోకి ప్రవేశించి వలస దారులు మీతీ ప్రజల అవకాశాలని కొల్లగొడుతున్నారు.PSP
  4. గత పదేళ్ల కి పైగా స్థానిక మితీ ప్రజలు మమ్మల్ని కూడా ST కేటగిరీ లోకి చేర్చి మాకు రక్షణ కల్పించండీ అంటూ ఆందోళనలు చేస్తూ వచ్చారు కానీ అక్కడి ప్రభుత్వాలు మొద్దు నిద్ర పోయాయి. చివరకి విసుగెత్తి రాష్ట్ర హై కోర్టుకి తమ సమస్యలని విన్నవించుకున్నారు. హై కోర్టు మితీ ప్రజల వాదనలని విన్న తరువాత మితీ ప్రజలని ST కేటగిరీలో చేర్చాల్సిందిగా కోరుతూ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపించాల్సినగా ఆదేశాలు ఇచ్చింది మణిపూర్ రాష్ట్ర ప్రభుత్వానికి.
  5. దాంతో ఆగ్రహించిన కుకీ,నాగా ప్రజలు మితీ ప్రజల మీద దౌర్జన్యానికి దిగారు. PSP
  6. కుకీ ప్రజలు సహజంగా వాడే కత్తులతో మరియు నాగా ప్రజలు AK-47 లతో విరుచుకు పడ్డారు.
  7. అయితే కుకీ,నాగా ప్రజల ఆగ్రహానికి మరో ముఖ్య కారణం ఉంది: దశాబ్దాలుగా కుకీ,నాగా ప్రజలు కొండల మీద అడవులలో గంజాయి సాగు చేస్తూ వస్తున్నారు. గంజాయి పంట చేతికి వచ్చాక గంజాయి ని ప్రాసెస్ చేసి దానిని హెరాయిన్ గా మార్చి అమ్ముకుంటున్నారు.
  8. మణిపూర్ అటవీ,రెవెన్యూ,పోలీసు అధికారులు ఇటీవలే దాడులు చేసి గంజాయి పంటని తగులపెట్టారు.
  9. మరోవైపు కుకీ,నాగా ప్రజలు గంజాయి ని పండించడం తమ జన్మ హక్కుగా భావిస్తూ అధికారుల మీద తిరగబడుతున్నారు తరుచూ! అసలు అడవులు తమవే అని వాదిస్తున్నారు కానీ అడవులలో ఉండడం వరకే వాళ్ళకి హక్కు ఉంది కానీ అటవీ స్థలాల మీద వాళ్ళకి ఎలాంటి హక్కు లేదు. కానీ దశాబ్దాలుగా కొన్ని స్వార్ధ శక్తులు మరియు దేశ ద్రోహ శక్తులు కలిసి కుకీ,నాగా ప్రజలకి అడవులు మీవే అంటూ మభ్యపెడుతూ వచ్చాయి.PSP
  10. మరో వైపు ఆర్టికల్ 371C ఇస్తున్న రక్షణ ని ఆసరా చేసుకొని కుకీలు దేశద్రోహానికి పాల్పడుతున్నారు. నిజానికి కుకీ తెగ ప్రజలు మణిపూర్ తో పాటు పక్కనే ఉన్న బర్మా దేశంలో కూడా ఉన్నారు. బర్మా లోని సైనిక నియంత ప్రభుత్వం కుకీలని అక్రమంగా భారత్ లోకి పంపించడానికి సహకరిస్తూ వచ్చింది ఇన్నాళ్లూ !
  11. మణిపూర్ లోని కొండ ప్రాంతాలలో నివసించే కుకీలు గంజాయిని పండించడం దానిని ప్రాసెస్ చేసి హెరాయిన్ గా మార్చి పక్కనే ఉన్న బర్మా దేశంలోకి మరియు బంగ్లాదేశ్ లోని తీసుకెళ్ళి అక్కడ ISI ఏజెంట్లకి అమ్ముతున్నారు. పాకిస్థాన్ ISI కి డబ్బు సమకూరే మార్గాలలో మణిపూర్ లోని కుకీ లు ఉంటున్న అడవులు ఒక మార్గం. కుకీల కి తక్కువ డబ్బు ఇచ్చి హెరాయిన్ ని కొని దానిని అంతర్జాతీయ మార్కెట్ లో ఎక్కువకి అమ్మి దానిని డాలర్ల రూపంలోకి మార్చుకుంటున్నది ISI.
  12. పాకిస్థాన్ ISI,బర్మా లోని సైనిక నియంత ప్రభుత్వ అధికారులు, చైనా తో కలిసి మణిపూర్ భౌగోళిక స్వరూపాన్ని మార్చేశారు దశాబ్దాలుగా.
  13. బర్మా లో ఉండే కుకీలని మణిపూర్ లోకి రప్పించి వాళ్ళకి దొంగ ఆధార్ కార్డులని ఇస్తూ వచ్చారు మణిపూర్ లో ఉంటున్న కుకీలు! ఈ అక్రమ వలసలని బర్మా లోని సైనిక జుంటా ప్రభుత్వం ప్రోత్సాహిస్తున్నది దశాబ్దాలుగా! దీని వల్ల బర్మా నుండి వచ్చిన కుకీ లకి మణిపూర్ లో ST హోదా వస్తుంది !
  14. ఎక్కడో కొండ ప్రాంతాలలోని అడవులలో కంప్యూటర్లు, ప్రింటర్లు,లామినేషన్ మిషన్లు పెట్టుకొని నకిలీ ఆధార్ కార్డులు ప్రింట్ చేస్తున్నారు కుకీలు. వీళ్ళకి ఇవన్నీ ఎక్కడ నుండి వచ్చాయి ? ISI వీళ్ళకి ఇవన్నీ సరఫరా చేసి ట్రైనింగ్ ఇచ్చి మరీ ప్రోత్సహిస్తూ వచ్చింది.
  15. ఒక్క బర్మా నుండి వచ్చే కుకీలకే కాదు నకిలీ ఆధార్ కార్డులు ఇచ్చేదీ. బంగ్లాదేశ్ నుండి అక్రమంగా మణిపూర్ లోకి వచ్చిన వాళ్ళకి కూడా ఇస్తూ వచ్చారు. దాంతో మైదాన ప్రాంతంలో ఉంటున్న హిందూ మితీ ప్రజల మెజారిటీ తగ్గిపోతూ అక్రమ వలస దారుల సంఖ్య పెరిగిపోయి మితీ ప్రజల జీవనోపాధికి గండి పడ్డది.
  16. సమస్య మితీ ప్రజలకి ST హోదా ఇవ్వమని కేంద్రానికి సిఫారసు చేయమని హై కోర్టు ఇచ్చిన ఆదేశాలతో పెద్దది అయ్యింది.
    &
    కుకీలకి,నాగాలకి AK-47 లు కొనేంత స్థోమత ఉందా ? హింసకి దిగమని మతాధికారుల నుండి సూచనలు వచ్చాయా ?
    వారం క్రితం భారత్ బర్మా కి వార్నింగ్ ఇచ్చింది అక్రమంగా కుకీలని బర్మా నుండి మణిపూర్ లోకి పంపించడం మీద కూడా ఒక కారణం !
    మణిపూర్ మెతీ హిందూ ప్రజలు మూడు డిమాండ్లు చేస్తున్నారు ఇప్పుడు.
  17. తమకి ST హోదా ఇవ్వాలి హై కోర్టు ఆదేశాల మేరకు.
  18. తక్షణమే NRC ని అమలు చేసి అక్రమ వలసదారులని గుర్తించి బయటికి పంపించేయాలి.
  19. UCC – యూనిఫాం సివిల్ కోడ్ చట్టాన్ని వెంటనే అమలులోకి తీసుకురావాలి.
  20. దేశంలో ఏ రాష్ట్రం కూడా ఇలాంటి డిమాండ్లు చేయట్లేదు అంటే మణిపూర్ లో పరిస్థితి ఎలా ఉందో మనం ఆలోచించుకోవాలి !

భారత దేశం మొత్తం 8 క్లాసికల్ డాన్స్ లలో మణిపురి డాన్స్ కూడా ఉంది. మణిపురి నృత్యం ప్రధానంగా రాధా కృష్ణ ల రాస లీల ల మీద ఆధారపడి ఉంటుంది. ఇది పురాతన నృత్య రీతి. మణిపురి డాన్స్ అనేది చాలా పురాతనమయిన వైష్ణవుల పండుగ[pre-Vaishnavite period] అయిన ‘లాయ్ హారోబ [Lai Haraoba] సందర్భంలో ఉద్భవించిన ప్రాచీన నృత్య రీతి నుండి ఇప్పటి మణిపురి డాన్స్ గా రూపాంతరం చెందింది. మనకేం పట్టింది అని వదిలేస్తే ప్రాచీన సంస్కృతి కి నిలయమయిన మణిపూర్ రాష్ట్రం తన పూర్వ వైభవాన్ని కోల్పోతుంది !
అందరం హాష్ టాగ్ చేస్తూ ‘Save Manipuri Save Meitei ‘ అని వైరల్ చేద్దామా ?
జై హింద్ ! జై భారత్ !

కర్టెసీ: పార్ధసారధి పోట్లూరి గారు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top