అడవి (6వ భాగం) – వసంత్ రావ్ దేశ్ పాండే

(గత సంచిక తరువాయి)  “అబే… నోరు మూసుకో హరామ్ఫర్! ఇదేం నీ బామ్మర్ది ఇల్లుకాదు- చికెన్ బిర్యానీ, రొయ్యల పులుసు పెట్టేందుకు. బయట పెద్ద దొరున్నడు. మొత్తుకొని నోరు జేస్తే రేపు నీతోలు తీసి ఎండేస్త. నోరు మూసుకొని పడి ఉండు… పెట్టింది తిను” అంటూ కళ్లెర్రజేసాడు ఒక జవాను.

“బయట ఎవరుంటే నాకేంది. భయమా! ఇది తిండా… తుత్ నీ” అంటూ కారియర్ డబ్బాను ఒక్క తన్ను తన్నాడు అతడు కసికొద్దీ బలంగా.
ఆ అన్నంగిన్నె గాలిలో లేచి వచ్చి, లోపలికొస్తూ ఉన్న యస్.పి. గారి ముందు పడింది. యస్.పి.గారు ముందుకు కదిలారు.

అంతా నిశ్శబ్దం అక్కడ. ఎస్.పి.గారి బూట్ల చప్పుడు తప్ప ఇంకో శబ్దం లేదు. ఎస్.పి.గారు వెళ్లి లాకప్ గది ముందు నిలబడ్డారు. మరుక్షణంలో లాకప్ గది తలుపులు తెరుచుకున్నాయి. I

లాకప్ గదిలో సిద్ధార్థ కాక మరో నలుగురున్నారు.

ముగ్గురి ముందు మూడు అన్నం గిన్నెలున్నాయి. నాల్గవ గిన్నె సిద్ధార్థ చేతిలో ఉంది. ఐదవ గిన్నె స్టేషన్ వాకిట్లో పడివుంది.

“ఏం జరిగింది?” అని అడిగారు ఎస్.పి. అన్నంగిన్నె తన్నినవాడి కళ్లలోకి చూస్తూ. అన్నంగిన్నెను తన్ని బూతులు కూసినవాడు ఎదురుగా ఎస్.పి.గారిని చూస్తూనే నీరుకారిపోయాడు. చుట్టూ ఉన్న నిశ్శబ్దం చూస్తుంటే అతడి గొంతు పెగలడంలేదు.
నీరుకారిపోయాడు. చుట్టూ ఉన్న నిశ్శబ్దం చూస్తుంటే అతడి గొంతు పెగలడంలేదు.

“ఏం జరిగింది?” అంటూ మళ్లీ రెట్టించాడు ఎస్.పి.

“అసలు…” అంటూ విషయం వివరించబోయాడు ఆ అన్నం గిన్నెలందించిన

కానిస్టేబుల్.

“యూ…” అని కోపంగా అంటూ, ఒక్క సెకను కాలం కళ్లు మూసుకున్నాడు ఎస్.పి. ‘వాణ్ణి చెప్పనీ. మధ్యలో నీ సంజాయిషీ ఏమిటి’ అన్నట్లు.

“నిన్నట్నించి కూడులేదు. ఆకలి అని అన్నమడిగితే గీ పాసిపోయిన అన్నం బెట్టిండ్లు. కుక్కలు కూడా నోరుబెట్టవు గీ అన్నంల. మేం మనుషులమా పశువులమా” అంటూ

చెప్పాడు పక్కనున్నవాడు లాకప్ గదిలోంచి.

విషయం అర్థమైన ఎస్.పి.గారు ‘ఏమిటిదంతా’ అంటూ ముఖం చిట్లించాడు.

సి.ఐ. ఏదో సర్దిచెప్పబోయాడు.

సంగతి చూడండి” అంటూ లాకప్ గదిలోకి దృష్టి సారించాడు. ఒక మూల తలవంచుకొని తింటున్న సిద్ధార్థ కనిపించాడు.

ఎలాంటి గొడవ లేకుండా తింటున్నాడు.

గిన్నెలో బాగా పాచిపోయిన అన్నాన్ని గిన్నెలోనే ఒక పక్కన పెడుతూ, మిగిలింది

తింటున్నాడు.

తింటున్న సిద్ధార్థ ఎస్.పి. ఉనికినే గమనించడంలేదు. ఆ అన్నాన్ని ఎంతో ప్రియంగా

తింటున్నాడు.

ఆకలయిన మనిషిలా, అన్నం విలువ తెలిసిన మనిషిలా తింటున్నాడు. తన ఉనికిని గమనించమన్నట్టు చప్పుడు చేసారు ఎస్.పి. తలెత్తి చూశాడు సిద్ధార్థ.

సశేషం

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top