ఎగురుతున్న జెండా మనది (35వ భాగం ) – డా.ప్రభాకర్ జైనీ

(గత సంచిక తరువాయి) అందుకే, ఇంటర్నేషనల్ డ్రగ్ మాఫియా, యూరోపియన్, తెల్లజాతి కిల్లర్స్క ఈ పని అప్పచెప్తే పట్టుబడతారని, వాళ్ళకి కాకుండా, మిమ్మల్ని కిడ్నాప్ చేసే పనిని ISI కు, వంద మిలియన్ డాలర్లకు అప్పచెప్పింది.

ISI కు వనరుల కొరత ఎప్పుడూ ఉంటుంది. అందుకే, మిమ్మల్ని కిడ్నాప్ చేసే

పనిని సంతోషంగా టేకప్ చేసింది.

ఇంత వరకు ఈ వివరాలు మనకు స్పష్టంగా తెలిసాయి. మిగిలిన డిటైల్స్ మీద మనవాళ్ళు వర్కౌట్ చేస్తున్నారు.

ఇప్పుడు ఈ అటాక్ జరిగింది కాబట్టి, వాళ్ళు ఈ అస్పైన్మెంటు టేకప్ చేసారనే

అనుకోవాలి.”

అంటూ తన ఉపన్యాసాన్ని ముగించి కూర్చున్నారు.
మాతాహరి

డ్రగ్ కార్టెల్ నుండి చారిగారి కిడ్నాప్కు సుపారీ ముట్టగానే ISI వెంటనే రంగంలోకి దిగకుండా, ఈ అస్పైన్మెంటు కోసం ఒక వ్యూహం రచించింది.

దొంగ దారుల గుండా మాదకద్రవ్యాల రవాణా చేయడం వాళ్ళకు కొట్టిన పిండి. కానీ, ఒక వ్యక్తిని శత్రు దేశంలోని ఒక మారుమూల గ్రామం నుండి పికప్ చేయడమంటే చాలా రిస్క్ తో కూడిన పని. అదీ కూడా మామూలు వ్యక్తిని కాదు. ప్రజల గుండెల్లో గూడుకట్టుకుని దైవంలా పూజించబడుతున్న వైద్యుణ్ణి కిడ్నాప్ చేసి దేశ సరిహద్దులు దాటించడం అంటే అడుగడుగునా ప్రమాదాలతో చెలగాటం ఆడడం అన్న మాటే. I

మామూలుగానే, ఎప్పుడైనా డ్రగ్స్ కన్సైన్మెంట్ (Cross Border Terrorism) పెద్దగా ఉంటేనే, వాళ్ళు బార్డర్ వెంబడి ఏదో ఒక అలజడి సృష్టిస్తారు.
అందుకని ఇంత పెద్ద ఆపరేషన్ జరగాలంటే ఇంకా పెద్ద సంఘటన, ఒక మారణకాండ లెవెల్లో జరగాలి. రెండు దేశాల మధ్య ఉన్న బద్ధ వైరం మూలంగా అదేమంతా పెద్ద సమస్య కాదు.

ఆ సంఘటన ఎలా ఉండాలంటే, భారతదేశం ఒక్కటే కాదు, ప్రపంచం మొత్తం నివ్వెరపోయి మాటలు రాకుండా నిశ్చేష్టయై నిలబడి పోవాలి.

ఎట్లాగూ, ISI బలమేమిటో, భారతదేశానికి చూపించక చాలా రోజులయింది ఈ ఒక్క దెబ్బతో రెండు పనులు పూర్తి కావాలి.

.

అందుకు పథకం రచించే పనిలో ఉండగానే, పూనం, వాళ్ళకు తురుపు ముక్కలా. గుర్తుకొచ్చింది. అప్పటికే డబుల్ ఏజెంట్గా పని చేస్తున్న పూనం కౌర్కు చారిగారి అసైన్మెంట్ ఇచ్చే ఉద్దేశంతో, వివరాలు కనుక్కోమని చెప్పారు.

చారిగారి కుటుంబం గురించి ఆరా తీసిన పూనం కౌరు నర్సింహ గురించి

తెలిసింది. నర్సింహా ప్యారిస్ ట్రైనింగ్కు వెళ్తున్నట్లు పసిగట్టింది. కానీ, ISI బాసులకు
ఆ విషయం అప్పుడే చెప్పకుండా, తనకున్న హై లెవెల్ కనెక్షన్స్ ఉపయోగించి అదే టైంలో అదే రిఫ్రెషన్ కోర్సు కోసం ‘రా’ నుండి తన పేరు కూడా చేర్చబడేలా చక్రం.
తిప్పింది. అక్కడ, పూనం అతి సులభంగా నర్సింహను బుట్టలో వేసుకుంది.

పారిస్ లో నర్సింహతో గడిపిన రాత్రి అతనికి సంబంధించిన అన్ని వివరాలు సేకరించింది.

జీవితంలో మొదటి సారిగా సుఖ సంద్రాలను ఈదినంత తృప్తిగా తన పక్కన మంచంలో పడుకున్న నర్సింహను జాలిగా చూసింది పూనం, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్లో ఎంత మొనగాడయినా నర్సింహ ఆడదాని విషయంలో మాత్రం అమాయకుడని తెలిసి నవ్వుకుంది. ఈ రోజుల్లో కూడా మగవాళ్ళు కూడా అస్ఖలిత బ్రహ్మచారులుగా ఉంటారని తనూహించలేదు. ఇట్లాంటి అమాయకుణ్ణి మోసం చేస్తున్నానానని ఒక్క క్షణం ఆమె లోని స్త్రీత్వం చలించింది. ఆ భావం కూడా ఒక్క లిప్త కాలం పాటు మాత్రమే.

మంచం దిగి వాష్ రూముకు వెళ్ళొచ్చి, డ్రస్ మార్చుకుంది.
నర్సింహ స్పృహలో లేడు. అతనికి స్పృహ తప్పించే డ్రగ్ చాలా కొద్ది మోతాదులో, అంతకు ముందే డ్రింకులో కలిపి ఇచ్చింది. దాని ప్రభావం వల్ల నర్సింహ తెల్లవారే వరకు లేవడు.

వెంటనే నర్సింహ ఫోన్, లాప్టాప్ తీసుకుని బయటకు నడిచింది.

రూం బయటకు రాగానే, ఆమె కోసమే ఎదురు చూస్తూ, చెట్ల నీడలో దాక్కున్న ఒక వ్యక్తి, కారు తీసుకొచ్చి ఆపాడు. ఇద్దరూ కలిసి బయల్దేరారు.

పారిస్ లోని పాకిస్థాన్ ఎంబస్సీకి చేరుకుని, లాప్టాప్, ఫోన్ సాఫ్టువేర్ నిపుణులకు

అందించింది.

వాళ్ళు, దిమ్మదిరిగే అనేక విషయాలు అందులో నుంచి డౌన్లోడ్ చేసుకున్నారు. ఏర్ఫోర్స్ ఇన్సలేషన్స్ గురించి, లేటెస్ట్ ఎయిర్ క్రాఫ్ట్ గురించి, బాంబ్ డిస్పోజల్

టెక్నిక్స్ మొదలైన ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నారు. పాటే వారిగారి గురించి ‘చరక’ గురించి ‘నర్సాపురం’ గురించి.
అక్కడి గుడి, గుళ్ళో పనిచేసే రామశాస్త్రి, లక్ష్మి, పుట్టణ్ణ, సాంబడు గురించి మొత్తం వివరాలు ఫోటోలతో సహా రిట్రీవ్ చేసుకున్నారు.
పాకిస్థాన్ అంబాసిడర్ తో పాటు, పారిస్ లోకల్ ISI చీఫ్, ఇంకా అనేక మంది అధికారులు ఆమె రాక కోసమే ఎదురు చూస్తున్నారు.

నను చూసి ISI చీఫ్,

క్యా కరేంగే. ఒక మంచి ప్లాన్ వేయాలి. ఇండియాలో పెద్ద ఇన్సిడెంట్ జరిగి చాలా రోజులైంది. ఇండియన్ ప్రైం మినిస్టర్ అమెరికాలో మీటింగ్ పెట్టి మన ఇజ్జత్ తీసిండు, UNల గూడా చాలా మాట్లాడుతున్నాడు. ఇండియన్ ప్రైం మినిస్టర్ డిప్లొమాటిగ్గా మంచి మార్కులు సంపాదిస్తున్నాడు. మనను వెధవల్లా ప్రోజెక్టు చేస్తున్నాడు. మన వజీర్ సాబ్ ఏం మాట్లాడడం లేదు. పరిస్థితి ఇలాగే ఉంటే, రెండు దేశాలు ‘భాయి భాయి’ అనుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. అప్పుడు మన పరిస్థితి ఏమిటి? మనం పాకిస్థానులో రియల్ బాస్ మనమే ఉండాలంటే, వెంటనే ఏదో ఒకటి జరగాలి. రెండు దేశాల ప్రజలు, ఆఫీసర్లు, రాజకీయ నాయకులు తన్నుకు చావాలి. ఎప్పటి లాగానే బార్డర్ దగ్గర టెన్షన్ ఉండాల్సిందే. లేకపోతే, మన
దేశాలు ‘భాయి భాయి’ అనుకునే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. అప్పుడు మన పరిస్థితి ఏమిటి? మనం పాకిస్థానులో రియల్ బాస్ గా మనమే ఉండాలంటే, వెంటనే.. ఏదో ఒకటి జరగాలి. రెండు దేశాల ప్రజలు, ఆఫీసర్లు, రాజకీయ నాయకులు తన్నుకు చావాలి. ఎప్పటి లాగానే బార్డర్ దగ్గర టెన్షన్ ఉండాల్సిందే. లేకపోతే, మన వజీర్ సాబ్ మనను పట్టించుకోడు. ISI ఇప్పటికే ఫండ్స్ లేక విలవిలలాడుతోంది. ఈ పరిస్థితుల్లో డ్రగ్ మాఫియా మనను పక్కన పెట్టేస్తే, పాకిస్థాన్ ప్రభుత్వం ఇచ్చే ముష్టి జీతాల మీద ఆధారపడి పనిచేయాల్సి ఉంటుంది. పరిస్థితి ఇలాగే కొనసాగితే, మనం లాహోూర్ జిన్నా సెంటర్లో ట్రాఫిక్ పోలీస్ పని కూడా చేయాల్సి వస్తుంది. అందుకే మన బాసులకు, మిలిటరీ వాళ్ళకు కూడా రెండు దేశాల మధ్య స్నేహం. పెరగడం ఇష్టం లేదు. దీన్ని శాశ్వతంగా ఖతం చేయాలె. అట్లా చేయాలంటే పెద్ద దెబ్బ కొట్టాలి. వజీర్ సాటు కూడా దిమ్మ తిరగాలి. పాకిస్థానులో పై చేయి ఎవరిదో తెలిసేటట్టు ఉండాలి ఆ దెబ్బ..

“మరేం చేద్దాం మేజర్ సాబ్ ?” అని అడిగింది పూనం కౌర్,
“అదే ఆలోచిస్తున్నాను. మన బీఫ్ తో మాట్లాడుతాను. ఏం చెయ్యాలో ప్లాన్ చేసి రేపు చెబుతాను, రేపొకసారి రాగలవా నువ్వు?” అన్నాడు జబ్బార్.

పూనం కంగారుగా.

“నయ్ మేజర్ సాబ్. అది చాలా డేంజర్, ఫారిన్ సాయిల్ మీద ట్రైనింగ్

జరుగుతున్నప్పుడు అబ్సెంట్ అయితే చాలా ప్రాబ్లెం. నేను ఎక్స్టెనేషన్ ఇచ్చుకోవాల్సి

వస్తుంది.” అంది.

సశేషం… 

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top